‘ మన్మథుడు 2’కి ముహూర్తం ఖరార్.

అక్కినేని నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ‘మన్మథుడు’ ముందు వరుసలో మనఅందరికి  కనిపిస్తుంది. నాగార్జున క్రేజ్ ను మరింతగా పెంచిన ఈ సినిమాకి సీక్వెల్ గా ‘మన్మథుడు 2’ రూపొందనుంది. రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని నాగ్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేసి, అదే రోజు నుంచి రెగ్యులర్ షూటింగు జరపనున్నారట. తొలి షెడ్యూల్ 10 నుంచి 15 రోజుల పాటు జరగనున్నట్టుగా చెబుతున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఇక కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో త్వరలో ‘బంగార్రాజు’ ప్రాజెక్టును కూడా నాగ్ పట్టాలెక్కించనున్నారు. తన సొంత బ్యానర్ పై రెండు సినిమాలను దాదాపు ఒకేసారి నాగ్ నిర్మిస్తుండటం విశేషం. Image result for nagarjuna

Leave a Response