‘ముఖ్యమంత్రి గారు.. మీరు మాట ఇచ్చారు’ సినిమాను ఆపివేయడం దారుణ: పోసాని

సెన్సార్ నిబంధలనలకు లోబడే తాను ‘ముఖ్యమంత్రి గారు… మీరు మాట ఇచ్చారు’ అనే సినిమాను తెరకెక్కించానని విలక్షణ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఈ చిత్రంతో ఎవరినీ తిట్టలేదని చెప్పారు. ఎవరో మోహన్ రావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు తన సినిమాను ఈసీ నిలిపేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ మార్కండేయులు తనకు లేఖ పంపారని… దీనికి సమాధానంగా మూడు పేజీలతో కూడిన వివరణను ఆయనకు పంపించానని చెప్పారు. సినిమాలో ఏముందో కూడా తెలుసుకోకుండా తన సినిమాను ఆపివేయడం దారుణమని అన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

Leave a Response