టాలీవుడ్ లో రవితేజ తాజా చిత్రంగా ‘డిస్కోరాజా’ రూపొందుతోంది. ఆ మధ్య నత్తనడక నడిచిన షూటింగ్ తిరిగి ఊపందుకుంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో, రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్ – నభా నటేశ్ నటిస్తున్నారు. ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది.
రెండవ షెడ్యూల్లో భాగంగా కొన్ని రోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో రవితేజ – వెన్నెల కిషోర్ కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ రోజు .. రేపు వికారాబాద్ లో షూటింగును ప్లాన్ చేశారు. కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న ఈ సినిమాలో మరో కథానాయికకు కూడా చోటు వున్నట్టుగా తెలుస్తోంది.