ఆర్ ఆర్ ఆర్’లో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరు ?

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – చరణ్ ప్రధాన పాత్రధారులుగా ‘ఆర్ ఆర్ ఆర్’ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తోంది. ఎన్టీఆర్ జోడీగా హాలీవుడ్ నుంచి ఒక అమ్మాయిని తీసుకుంటే, కొన్ని కారణాల వలన ఆమె తప్పుకుంది.ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోనున్నారనేది అప్పటి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తూనే వుంది. ఈ విషయంపై ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టడం కోసం రాజమౌళి రంగంలోకి దిగారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటించనుందని ప్రకటించారు. “ఒలివియా మోరిస్ కు స్వాగతం .. ఈ సినిమాలో మీరు ‘జెన్నిఫర్’ అనే ప్రధానమైన పాత్రను పోషించనున్నందుకు మాకు చాలా సంతోషంగా వుంది. మీరు షూటింగులో పాల్గొనే రోజు కోసం ఎదురుచూస్తున్నాము” అంటూ ఈ సినిమా టీమ్ ట్వీట్ చేసింది.

Leave a Response