హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా ‘నిశ్శబ్దం’ రూపొందింది. విభిన్నమైన కథా కథనాలతో ఈ సినిమా నిర్మితమైంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ సాంగ్ ప్రోమోను వదిలారు. “నిన్నే నిన్నే కనులలో నింపుకున్నా .. నిన్నే నిన్నే మనసులో ఒంపుకున్నా” అంటూ ఈ సాంగ్ సాగుతోంది.అనుష్క – మాధవన్ పై చిత్రీకరించిన ఈ పాట ఆహ్లాదకరంగా అనిపిస్తోంది. గోపీసుందర్ బాణీ .. భాస్కర భట్ల సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన మనసుకు పట్టేలా వున్నాయి. అంజలి .. షాలినీ పాండే ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించారు. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఇది కూడా ఒకటిగా చేరిపోతుందనే అభిప్రాయాలు ఫిల్మ్ నగర్లో వ్యక్తమవుతున్నాయి.
previous article
రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రం ట్రైలర్
next article
తేజు నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్