బిగ్ బాస్ 3 టీజర్…

బుల్లీతేరా అభిమానులను ఎంతగానో అలరించిన రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’ అన్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ముచ్చటగా మూడో ఏడాది అభిమానుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో దీనికి ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారన్న ఊహాగానాలకు టాలీవుడ్ లో వస్తూనే ఉన్నాయి. టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘బిగ్‌బాస్‌3’కు వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్‌ను ‘స్టార్‌ మా’ ఈ రోజు తెలుగు అభిమానుల ముందు పెట్టింది. మార్కెట్‌కు వచ్చిన నాగార్జునను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే, కిలోల కొద్దీ కూరగాయలు, వంట సామగ్రి ఆర్డర్‌ చేస్తూ కనిపించారాయన. చివర్లో ‘మీరు వచ్చారేంటి సర్‌’ అని ఓ దుకాణదారు అడిగితే ‘ఈసారి నేనే రంగంలోకి దిగుతున్నా’ అంటూ నాగ్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. ఈ సీజన్‌లో 14మంది బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లనున్నారు. మొత్తం 100 రోజుల పాటు ఈ షోను నిర్వహించనున్నారు. మొదటి సీజన్‌కు ఎన్టీఆర్‌, రెండో సీజన్‌కు నాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇక తొలి సీజన్‌ విజేతగా శివబాలాజీ, రెండో సీజన్‌ విజేతగా కౌశల్‌లు నిలిచారు. మరి ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో వెళ్లేది.. విజేతగా నిలిచేది ఎవరో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే అన్ని అంటున్నారు. ఇక ఈ షో కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Leave a Response