బాలయ్య 105 వ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి..?

అభిమానులచేత బాలయ్య అని ముద్దుగా పిలిపించుకొనే బాలకృష్ణ ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు నిర్మాత. యువరత్న బాలకృష్ణగా ప్రసిద్ధిగాంచిన బాలయ్య వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో చేయుటకు ప్రసిద్ధి. తన సినీజీవితంలో ఎన్నో తెలుగు సినిమాలు చెయ్యడం వలన తెలుగువారికి సుపరిచితుడు. ఇతను నటసార్వభౌమ ఎన్.టి.రామారావు కుమారుడు తండ్రి పేరు కాకుండా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నారు. తనదయిన రీతిలో ప్రజలను తన నటనతో ఆకట్టుకుంటాడు బాలయ్య ఇక విషయానికి వెళ్తే

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 105వ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌పై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన బాలకృష్ణ న్యూ లుక్‌‌పై మంచి కామెంట్స్ వ్యక్తమైన విషయం తెలిసిందే. అలాగే ఇటీవల థాయ్‌లాండ్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తయ్యింది.చిత్ర నటీనటులందరూ పాల్గొనగా.. 20 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో రెండు పాటలు, కొంత టాకీపార్ట్‌, భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ను షూట్‌ చేశారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి. రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Leave a Response