భగత్ సింగ్ విషయంలో గాంధీ చేసిన తప్పులు..?

ప్రతీ ఒక్కరు తెలుసుకోవలసినది తర్వాతతరానికి తెలియజేయాలసింది ”చరిత్ర” . ఒక మంచి పుస్తకం చదివేకొద్దీ చదవాలనిపిస్తుంది. ఒక మంచి కథ వినేకొద్దీ వినాలనిపిస్తుంది. అలాంటి కథ ఆ పుస్తకం మన చరిత్ర అయితే మనం నేర్చుకుంది ఎంతో జ్ఞానం, విజ్ఞానం . మన ప్రతీ ప్రశ్నకు జవాబు మనచరిత్రలోనే దొరుకుతుంది. అందుకోసం మీకోసం సినీస్టార్స్ గురించి కాదు, రియల్ స్టార్స్ గురించి రాస్తున్న.స్వాతంత్య్రం కోసం ఎంతో మంది సమరయోధులు తమ ప్రాణాలను విడిచారు. వందే మాతరం అన్న మాటకోసం ఎంతో మంది తల్లులు తమ కన్నబిడ్డలను పోగొట్టుకున్నారు. కానీ చనిపోయే ప్రతి ఒక్కరు తమ తల్లి అయిన జన్మభూమికోసం మరణించారు. వారిలోనే మన భారత మాతకోసం మరణించిన భగత్ సింగ్ కూడా ఒకరు ఈ రోజు మన చరిత్రలో భగత్ సింగ్

1907 సెప్టెంబరు 28 న ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు. భగత్ సింగ్ అరాజకవాదం(అనార్కిజం), సామ్యవాదం(కమ్యునిజం) అనే భావనలకు ఆకర్షితుడయ్యాడు. బకునిన్, మార్క్స్, లెనిన్ మరియు ట్రాట్స్కి ల రచనలంటే భగత్ కి చాలా ఇష్టం. అహింస, సత్యాగ్రహాలను బోధించే గాంధేయవాదం మీద భగత్ కి నమ్మకం ఉండేదికాదు. గాంధేయవాదం దోపిడిదారుల్ని మారుస్తుందే కానీ, దోపిడీ నుంచి విముక్తి కల్పించదని భగత్ విశ్వసించేవాడు.భగత్ సింగ్ స్వాతంత్ర్య సమర యోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. ఢిల్లీ వీదిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు.విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే.భారత స్వాతంత్ర్యోద్యమము లో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు. ఈ కారణంగానే షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు. చరిత్రకారుడు కె.ఎన్. పణిక్కర్ ప్రకారం భగత్ సింగ్, భారతదేశంలో ఆరంభ మార్కిస్టు. భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకడు. అనేక విప్లవాత్మక సంస్థల్లో ఆయన చేరాడు. హిందూస్తాన్ గణతంత్ర సంఘం (HRA)లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతికాలంలోనే అందులోని నాయకుల్లో ఒకడుగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందూస్తాన్ సామ్యవాద గణతంత్ర సంఘం (HSRA)గా మార్చాడు. భారత మరియు బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహారదీక్షను చేపట్టడం ద్వారా సింగ్‌ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజ్‌పత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయనకు ఉరిశిక్ష ఖరారయింది.

సింగ్‌ను ఉరితీయకుండా ఆపే అవకాశం మహాత్మా గాంధీకి ఉండటం చాలా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. అయితే ఆయన అలా చేయలేదు. భగత్ సింగ్‌ పట్ల విచిత్ర వైఖరితో వ్యవహరించిన మరియు ఆయన ఉరిని వ్యతిరేకించని వ్యక్తిగా గాంధీని చూపిన ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ వంటి పలు చిత్రాలు విడుదల తర్వాత ఈ ప్రత్యేక వాదం ఆధునిక ప్రజల్లో బాగా వ్యాపించింది.[39] అయితే సింగ్‌ను ఉరితీసేలా బ్రిటీష్ ప్రభుత్వంతో కలిసి గాంధీ కుట్రపన్నాడనేది మరో భిన్న వాదం. ఈ రెండు వాదాలు కూడా సందేహాస్పదంగానూ మరియు వివాదాస్పదంగానూ మారాయి. సింగ్‌ను ఉరి నుంచి తప్పించడానికి గానీ లేదా శిక్షను తగ్గించడానికి బ్రిటీషు ప్రభుత్వంతో గాంధీకి అంతగా సాన్నిహిత్యం లేదనేది ఆయన అనుచరుల వాదన. అంతేకాక స్వాతంత్ర్యోద్యమంలో సింగ్ పాత్ర ఉద్యమ నాయకుడిగా గాంధీ పాత్రకు ఎలాంటి ముప్పు లేదు. అందువల్ల సింగ్ చనిపోవాలని గాంధీ కోరుకోవడానికి కారణం లేదని ఆయన అనుచరులు స్పష్టం చేశారు.

చివరకు అయన 1931 మార్చి 23 న తుది శ్వాస విడిచారు. భగత్ సింగ్ మరణం ఊరికే వృథా కాలేదు, ఎందరో యువకులను భారత స్వాతంత్ర్యోద్యమము వైపుకు మరల్చింది. భగత్ సింగ్ ఉరి శిక్ష అమలు తరువాత ఉత్తర భారతదేశంలో ఎందరో యువకులు బ్రిటిషు ప్రభుత్వం మరియు గాంధీ కి విరుద్ధంగా ఆందోళనలు చేపట్టారు. భగత్ సింగ్ సమకాలీన భారతదేశంలోనే కాక స్వాతంత్ర్యానంతర భారతదేశంలో కూడా విప్లవానికి చిహ్నంగా ప్రసిద్ధిచెందారు. ఈ రోజున మన ఆనందంగా స్వేచ్ఛగా ఉండడానికి కారణం ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాలే..జై హింద్

Leave a Response