ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం..?

పీజే న్యూస్ ; శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ఉన్న పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప తో పాటు పలు ప్రాంతాలలో డెంగ్యూ కలకలం రేపుతోంది. ఇప్పటికే ఓ బాలుడి ప్రాణాలు కోల్పోగా కొంతమంది పిల్లలు, పెద్దలు ఆస్పత్రులలో డెంగ్యూ తో పోరాడుతున్నారు. అందులో కొంత మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. ముఖ్యంగా వాంబే బిల్డింగ్ ల నుండి ఓపెన్ డ్రైన్( మురుగునీరు) మెయిన్ వాటర్ ట్యాంక్ వాటర్ వాల్ లో కలవడంతో త్రాగే నీరు కలుషితం అవుతోంది. ఆ కలుషిత నీరు తాగి ఎంతో మంది ఆసుపత్రి పాలవుతున్నారు. ఈ సమస్య పై అధికారులు అతి త్వరలో చర్యలు తీసుకుని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యలపై అధికారులు గాని ప్రజా ప్రతినిధులు, నాయకులు గానీ ఏ మాత్రం చొరవ తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Leave a Response