కెరియర్ కోసం భయపడకుండ..?నాగార్జున

నటనకు మారుపేరు నాగార్జున అంటారు. తండ్రి పేరును కాకుండా తనకంటూ ప్రజలలో ఒకపేరును తెచ్చుకున్నాడు. తన అందంతో మన్మధుడు అన్నపేరును సంపాదించుకున్న మొదటి హీరో నాగార్జున. ఎంతో అందంగా ఉన్న కేరెక్టర్లే కాకుండా తన కెరియర్ కోసం భయపడకుండా ఒక దేవుడిలా కనిపించి ప్రజలను షాక్ కి గురిచేసారు. ఈయన చేసిన నటనకు ప్రజలు మైమరిచిపోయారు. ఇక ఈయన గురించి చెప్పాలంటే.

నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి 18, 1984 న లక్ష్మితో జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ కు సోదరి. వీరిరువురు కొన్ని కారణాలవల్ల విడాకులు తీసుకున్నారు. తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు. ఈమె మాజీ దక్షిణ భారత నటి. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య మొదటి భార్య కొడుకు. అఖిల్ రెండొవ భార్య కొడుకు.
కానీ అమల గారు ఇద్దరిని సమానంగా చూస్తారు. ఈయన 80 సినిమాలకు పైగా నటించారు. ఇప్పటికి నటిస్తూవున్నారు. ఈ రోజు నాగార్జున గారి పుట్టిన రోజు సందర్భంగా పీజే న్యూస్ తరుపున జన్మదినోత్స్వ శుభకాంక్షలు.

Leave a Response