బందోబస్త్ తో వస్తున్న సూర్య…

కోలీవుడ్ యాంగ్ హీరో సూర్య తమిళ నటుడు. టాలీవుడ్ లో నటించింది కొన్ని సినిమాలే అయినా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మూడు సార్లు ఉత్తమ నటుడిగా, మూడు సార్లు ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఇతడు నటించిన గజిని అందర్నీ అలరించింది. తర్వాత విడుదలైన ఆరు, కథానాయకుడు అంత విజయవంతం కాలేదు. ఇతడు అందాల సుందరి, సినీనటి జ్యోతిను పేళ్ళిచేసుకున్నారు. రజనీకాంత్ తరువాత లింగాయత్ వర్గం నుంచి దక్షిణ భారత స్థాయిలో గుర్తింపు ఉన్న నటుడు. ప్రస్తుతం హీరోగా తమిళంలో ‘కాప్పన్’ సినిమా నిర్మితమైంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో, మోహన్ లాల్ .. ఆర్య కీలకమైన పాత్రలో అభిమానుల ముందుకు వస్తున్నారు. హీరోయిన్ గా సాయేషా సైగల్ అలరించనుంది. ఈ సినిమాను ఆగస్టు 30వ తేదీన అభిమానుల ముందుకు రానుంది. సూర్య తన ప్రతి సినిమాను తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేస్తుంటారు. అలాగే ‘కాప్పన్’ సినిమాను కూడా తెలుగులో అదే రోజున విడుదల చెయ్యడం విశేషం. తాజాగా ఈ సినిమాకి తెలుగులో ‘బందో బస్త్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు దర్శకుడు. స్పెషల్ కమాండో ఆఫీసర్ గా సూర్య కనిపించే ఈ సినిమాలో, బొమన్ ఇరాని .. సముద్రఖని ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో అతిథి పాత్రలో కార్తీ మెరవనుండటం విశేషం. హారీస్ జైరాజ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. ఈ సినిమా కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతాగానో ఎదురు చూస్తున్నారు.

Leave a Response