టాలీవుడ్ ప్రముఖ నటుడు ఘట్టమనేని కృష్ణ భార్య. ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన విజయా స్టూడియోకు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము. ఈమె మొదటి పెళ్ళి ద్వారా సినీ నటుడు నరేష్‌కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి జయసుధకు ఈమె పిన్నమ్మ. 2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా.తాను దర్శకురాలిగా గిన్నీస్ ప్రపంచ రికార్డులోకెక్కినది.ఈమె నటించిన అధిక చిత్రాలలో కథానాయకుడు కృష్ణ కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు. ఇక ఎన్నో సినిమాలో నటించి తన కంటూ ఓ స్థాయిని తెచ్చుకున్న గొప్ప నటి. ఇక విషయానికి వస్తే బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో విజయనిర్మల బాధపడుతున్నారన సంగతి తెలిసిందే. ఏడేళ్ల వయసులో బాలనటిగా తమిళ చిత్రం మత్స్యరేఖతో సినీరంగ అరంగేట్రం చేశారు. 11 ఏళ్ల వయసులో పాండురంగ మహత్యం సినిమాతో తెలుగులో ఆమే పరిచయమయ్యారు.
previous article
300 మంది పిల్లలకు బాధ్యత నేనే తీసుకుంటా…
next article
సీనియర్ హీరోలు విజయ నిర్మలకు నివాళు అర్పిస్తున్నారు…