300 మంది పిల్లలకు బాధ్య‌త‌ నేనే తీసుకుంటా…

జూనియర్ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ చిత్రంతో సినీ రంగప్రవేశం చేశాడు. నిఖిల్ హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. నట శిక్షకుడు ఎన్.జె. భిక్షు దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. హాపీడేస్ చిత్రంలో నటించుటకు ముందు చిన్న చిన్న పాత్రలను వివిధ సినిమాలలో వేశాడు. “హాపీ డేస్” సినిమా ఇతర భాషలో విడుదల కాకముందే టాలీవుడ్లో విడుదలైన తన మొదటి సినిమా గా నిలిచింది. ఈ సినిమాని జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అభిమానుల ముందుకు వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో గల నలుగురు స్నేహితులలో ఒకనిగా నిఖిల్ నటించాడు. ఈ చిత్రం విజయంతో నిఖిల్ యొక్క కీర్తి పెరిగింది. 2007 లో అతి తక్కువ బడ్జెట్ తో తీసి కమర్షియల్ హిట్ అయిన చిత్రంగా హ్యాపీడేస్ చిత్రం నిలిచింది. అతని మొదటి సోలో చిత్రం అంకిత్,పల్లవి& ఫ్రెండ్స్. యువత మరియు వీడు తేడా చిత్రాలలో నటించాడు. అవి 50 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఆడాయి. ఇలా ఎన్నో సినిమాలో నటించి తన కంటూ ఓ స్థాయిని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నిఖిల్ 300 మంది పిల్ల‌ల చ‌దువుకు తాను బాధ్య‌త‌ను తీసుకోవ‌డం ద్వారా త‌న పెద్ద మ‌న‌సుని చాటుకున్నారు. ఇక రీసెంట్‌గా హీరో నిఖిల్ భీమ‌వ‌రంలోని ఓ పాఠ‌శాల‌ను సంద‌ర్శించారు. అక్క‌డ 300 మంది పిల్ల‌లు చ‌దువుకుంటున్నారు. వారి వివరాల‌ను తెలుసుకున్న హీరో నిఖిల్ ప్రారంభం నుండి ఆ పాఠ‌శాల‌లో వారి చ‌దువు ముగిసేవ‌ర‌కు ఆ బాధ్య‌త‌ను తానే స్వీక‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టిస్తూ ఆ పిల్ల‌ల‌తో దిగిన కొన్ని ఫోటోల‌ను పోస్ట్ చేశారు. త‌నను ఈ కార్య‌క్ర‌మంలో భాగం చేసిన ర‌క్షాద‌ల్ స‌భ్యులు మ‌హేంద్ర‌, రాంబాబుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. భవిష్య‌త్‌లో మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తాన‌ని కూడా ఈ సంద‌ర్భంగా తెలియ‌జేశారు.ఇక తాను చేసిన మంచి పనికి టాలీవుడ్ అంత ప్రశంషలు కురిపిస్తున్నారు.

Leave a Response