టీ20కి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు దెబ్బ తగలడం ఆందోళన కలిగించింది. అయితే అది తీవ్రమైనది కాదని మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడని తేలడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. శుక్రవారం నెట్ ప్రాక్టీ్‌సలో త్రోడౌన్ సందర్భంగా రోహిత్ పొత్తికడుపులో బంతి బలంగా తాకింది. దాంతో విలవిల్లాడిన రోహిత్ నెట్ ప్రాక్టీ్సనుంచి అర్ధంతరంగా వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్‌తో సిరీ్‌సలో ఆ జట్టులోని ఎడమ చేతి సీమర్లు.. ముఖ్యంగా ముస్తాఫిజుర్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు టీమిండియా.. శ్రీలంక ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ నువాన్ సెనెవిరత్నే సేవలు తీసుకొంటోంది. నెట్ ప్రాక్టీ్‌సలో 38 ఏళ్ల ఎడమ చేతి ఫాస్ట్ బౌలర్ నువాన్ భారత బ్యాట్స్‌మెన్‌కు బంతులు విసురుతున్నాడు. ఆ క్రమంలో నువాన్ బంతి ఒకటి రోహిత్‌కు బలంగా తాకింది. భారత్‌లోని చాలా మైదానాల్లో ప్రాక్టీస్ పిచ్‌ల నాణ్యత అంతంతమాత్రమే. దాంతో నెట్ ప్రాక్టీ్‌సలో క్రికెటర్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. అయినా రోహిత్‌కు దెబ్బ తగలడం జట్టులో ఆందోళన రేపింది. నెట్స్‌లో అతడు ఫీల్డింగ్ చేయడంతో సంజూ కీపింగ్ చేయడని అర్థమైపోయింది. మరోవైపు రిషభ్ పంత్ వికెట్ల వెనుక తీవ్రంగా శ్రమించాడు.
Tags:rohith sharmat 20
previous article
విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ తో
next article
పోలీస్ ఆఫీసర్ గా రవితేజ