ఒలింపిక్స్‌కు భారత..!

Indian to the Olympics!

భారత పురుషులు, మహిళల హాకీ జట్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. భారత జట్లు మొదటి రోజుకు పరస్పర భిన్నమైన ఆటతీరు కనబరచడం గమనార్హం. రెండో మ్యాచ్‌లో మహిళల జట్టు 1-4తో అమెరికా చేతిలో కంగుతిన్నది. అయితే శుక్రవారంనాటి మ్యాచ్‌లో రాణీరాంపాల్‌ సేన 5-1తో నెగ్గిన సంగతి తెలిసిందే. ఫలితంగా వచ్చే ఏడాది జపాన్‌లోని టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కు బెర్త్‌ సొంతమైంది. రెండో మ్యాచ్‌లో అమందా మగదన్‌ (5, 28వ నిమిషాలు), కెప్టెన్‌ కాథ్లీన్‌ షర్కే (14వ.), అలీసా పార్కర్‌ (20వ.) అమెరికా తరపున గోల్స్‌ కొట్టారు.తొలి మ్యాచ్‌లో భారత మహిళలు ఆడిన తీరుచూస్తే శనివారం జరిగిన రెండో పోరు ఏపక్షమే అనుకున్నారు. కానీ మనోళ్ల ప్రదర్శన పూర్తిగా దిగజారగా ఇదే అదనుగా అమెరికా రెచ్చిపోయింది. తొలి 28 నిమిషాలు ముగిసేసరికే నాలుగు గోల్స్‌తో భారత్‌పై ఆధిపత్యం సాగించింది. అప్పటికి భారత్‌ ఒక్క గోల్‌ కూడా చేయలేకపోయింది. మొదటి రెండు క్వార్టర్లలో అమెరికాది పైచేయి కాగా చివరిదైన నాలుగో క్వార్టర్‌లో భారత్‌ సత్తాచాటింది.పురుషుల విభాగం రెండోమ్యాచ్‌లో ప్రపంచ ఐదో ర్యాంకరైన భారత్‌ 7-1 గోల్స్‌ తేడాతో 22వ ర్యాంకర్‌ రష్యాను చిత్తుచేసింది. రష్యాకు అలె క్సి సొబొలెవెస్కి ఏకైక గోల్‌ అందించాడు.

Tags:olympics

Leave a Response