తాజాగా ప్రియాంక రెడ్డికి జరిగిన అన్యాయంపై తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. అయితే కేటీఆర్ ట్విట్ కు స్పందిస్తూ వివిఎస్ లక్ష్మణ్ “నేను కేటీఆర్ తో ఏకీభవిస్తున్న. ఇదే సరైన సమయం అటువంటి అమానవీయ మరియు భయంకరమైన నేరాలకు పాల్పడే నేరస్థులను శిక్షించండి మరియు విశ్రాంతి ఇవ్వకండి” అని ట్విట్ చేశారు. స్త్రీలు మరియు పిల్లలపై హింసకు పాల్పడే ఎవరికైనా ఆలస్యం చేయకుండా మరణశిక్ష విధించబడుతుంది మరియు సమీక్షకు ఎంపిక లేదు. దేశం యొక్క చట్టానికి భయపడనట్లు కనిపించే ఈ జంతువుల నుండి మన దేశాన్ని రక్షించడానికి వేగంగా పనిచేద్దాం అన్నారు.రోజులు మారుతున్నాయి, నెలలు మారుతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్న సమాజంలో మాత్రం పరిస్థితులు మారడం లేదు. మానవ విలువలను సాధించడంలో విఫలం అవుతున్నామని అన్నారు.