టెర్రరిస్టులకు వణుకు…

ఏ చిన్న కదలికనైనా ఇట్టే కనిపెట్టేస్తుంది అదే కార్టోశాట్ 3 ప్రత్యేకత. 5 ఏళ్ళ పాటు అంతరిక్షం నుంచి నిఘా పెడుతుంది. చంద్రయాన్ 2 ప్రయోగం తర్వాత డీలా పడిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ విజయం ఎంతో హుషారు నిచ్చింది. భారత కీర్తి పతాక వినువీధుల్లో మరోసారి రెపరెపలాడింది. ఎందుకంటే ఇది మరి రక్షణ రంగానికి తిరుగులేని ఆయుధం. పాక్ భూభాగం లోని టెర్రరిస్టు స్థావరాలపై గతంలో మన సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ టైంలో రిసార్ట్ శ్రేణికి చెందిన శాటిలైట్ ఆర్మీకి సహకరించింది. కార్టోశాట్ 3 రీశాట్ కంటే పవర్ ఫుల్, రీశాట్ శ్రేణుల్లో కార్టోశాట్ 3 మూడో తరం ఉపగ్రహం. 25 సెంటీమీటర్ల హై రిజల్యూషన్ తో ఫొటోలు తీసే సామర్థ్యం దీని సొంతం. ఈ శాటిలైట్ ను భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో ఉంచారు. కార్టోశాట్ ౩ కి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దీని తయారీకి 350 కోట్లు ఖర్చయింది. ఈ శాటిలైట్ బరువు 1,625 కిలోలు. కార్టోశాట్ 3 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. వీటిలో 12 ఫ్లోప్ ఓర్సి నానో ఉపగ్రహాలు ఉన్నాయి. 5 కిలోల చొప్పున బరువుండే వీటిని డౌ అంటే పావురాలు అని పిలుస్తారు. శతృదేశాల నుండి అడ్డదారుల్లో చొరబడే టెర్రరిస్టుల ఆటలను ఇక సాగనివ్వకుండా చేయనుంది.

Tags:isronellore district

Leave a Response