టాలీవుడ్ విక్టరీ వెంకటేశ్ – నాగచైతన్య కథానాయకులుగా బాబీ దర్శకత్వంలో ‘వెంకీమామ’ రూపొందుతోంది. రెండు వారాలపాటు ఈ సినిమా షూటింగు కశ్మీర్ లో జరిగింది. ఆర్మీ నేపథ్యంలో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.
ఈ నెల 13వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగు మొదలుకానుంది. ఇది మేజర్ షెడ్యూల్ అనీ .. ఏకధాటిగా షూటింగు చేస్తారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో చాలాభాగం చిత్రీకరణ పూర్తయినట్టు అవుతుందని అంటున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో చైతూ జోడీగా రాశీ ఖన్నా .. వెంకటేశ్ సరసన పాయల్ నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నారనేది త్వరలోనే ప్రకటించనున్నారు.