ప్రేమ పెళ్లి చేసుకున్న ఆర్య…

మార్చి 10న మాంగ‌ల్య బంధంతో ఒక్క‌టైన కోలీవుడ్ న్యూ క‌పుల్ ఆర్య‌, సాయేషా సైగ‌ల్. 2018లో వ‌చ్చిన గ‌జినీకాంత్ చిత్రంలో వారిద్ద‌రు క‌లిసి న‌టించ‌గా, ఆ స‌మ‌యంలో ఇద్ద‌రు ఈ మ‌ధ్య ప్రేమ పెళ్లిలు ఇండస్ట్రీలో ఎక్కువే జరుగుతున్నాయి . ప్ర‌స్తుతం సూర్య‌-కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క‌ప్పం చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో మోహ‌న్ లాల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అయితే వివాహానంత‌రం ఆర్య‌,సాయేషా న‌టించ‌నున్న‌ తొలి చిత్రం పేరు టెడ్డీ. శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. చిన్న పిల్ల‌ల‌తో పాటు యూత్ ఈ చిత్రానికి ఎక్కువ‌గా క‌నెక్ట్ అవుతార‌ని మేక‌ర్స్ అంటున్నారు. స్టూడియో గ్రీన్ బేన‌ర్‌పై జ్ఞాన‌వేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆర్య‌, సాయేషా ఫ‌స్ట్ పార్ట్‌లో ప్రేమికులుగా, సెకండాఫ్‌లో భార్య‌భ‌ర్త‌లుగా క‌నిపిస్తార‌ని స‌మాచారం. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డించ‌నున్నారు.Sayyeshaa Saigal and Arya creates new magic

Leave a Response