బాలీవుడ్లో బాలనటిగా సినిమాలు చేసిన హన్సిక `దేశముదురు` చిత్రంతో హీరోయిన్గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. అయితే హీరోయిన్గా మారిన తర్వాత హిందీ కంటే ఈమె తెలుగు, తమిళ చిత్రాలకే పరిమితమైంది. ముఖ్యంగా తమిళ తంబీలకు ఫేవరేట్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో `తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్` సినిమా మాత్రమే చేస్తున్న హన్సిక చేతిలో నాలుగైదు తమిళ ప్రాజెక్టులున్నాయి. ఈ అమ్మడుకి దీపావళి సందర్భంగా ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇంతకు ఆ కారును బహుమతి ఇచ్చిందెవరో తెలుసా? హన్సిక తల్లి మనో మొత్వాని. దీపావళి సందర్భంగా మనో మొత్వాని హన్సికకు రూ.10కోట్లకు పైగా ఖరీదైన రోల్స్ రాయిస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ వీడియోను హన్సిక సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో వైరల్ అవుతుంది.
previous article
పవన్ కుమార్తె ఆద్య చరణ్ సినిమాకు డైరెక్ట్..
next article
తన కుటిల బుద్ధిని చాటుకున్నా పాక్..!