ప‌వ‌న్ కుమార్తె ఆద్య చ‌ర‌ణ్‌ సినిమాకు డైరెక్ట్..

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌కు బాబాయ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంటే చాలా ఇష్టం. ప‌వ‌న్ కూడా చెర్రీ అంటే ప్ర‌త్యేకాభిమానం క‌న‌ప‌రుస్తుంటారు. ఇక ప‌వ‌న్ పిల్ల‌లైతే చ‌ర‌ణ్‌తో చాలా స‌న్నిహితంగా ఉంటార‌ట‌. అలాగే సుస్మిత‌, శ్రీజ‌ల కూతుళ్లు, నాగ‌బాబు కూతురు నిహారిక‌, ప‌వ‌న్ కల్యాణ్ కుమార్తె ఆద్య అంద‌రూ ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు బోర్డ్‌పై వాళ్ల‌కు తోచింది రాస్తుంటార‌ట‌. ప‌వ‌న్ కుమార్తె ఆద్యకు మాత్రం చ‌ర‌ణ్‌ను హీరోగా పెట్టి ఓ సినిమాను డైరెక్ట్ చేయాల‌నుందని ఆ బోర్డులో రాసింద‌ట‌. ఇలా చిన్నారి ఆద్య త‌న కోరిక‌ను బోర్డ్‌పై రాసి చ‌ర‌ణ్‌కు చెప్పింది. మ‌రి ఫ్యూచ‌ర్‌లో నిజంగానే చ‌ర‌ణ్‌ను ఆమె డైరెక్ట్ చేస్తుందో లేదో చూడాలి.

Leave a Response