దీపావ‌ళి సంద‌ర్భంగా బ్యాన‌ర్ లోగోను విడుద‌ల చేసిన మ‌నోజ్

మంచు మోహ‌న్‌బాబు రెండో త‌న‌యుడు మంచు మ‌నోజ్ హీరోగా అంద‌రికీ సుప‌రిచితుడే. గ‌త కొంత కాలంగా ఆయన సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. వ్య‌క్తిగ‌త జీవితంలోనూ కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు. రీసెంట్‌గా భార్య నుండి విడిపోయారు. ఈ విష‌యాల‌ను ఆయ‌నేం దాచి పెట్టుకోలేదు. బ‌హిరంగంగానే అంద‌రికీ తెలియ‌జేశారు. తాను త్వ‌ర‌లోనే కొత్త జ‌ర్నీని స్టార్ట్ చేస్తాన‌ని కూడా చెప్పిన మ‌నోజ్ అన్న‌ట్లుగానే కొత్త జ‌ర్నీని స్టార్ట్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా సినిమాల్లో న‌టించిన మ‌నోజ్‌ ఇప్పుడు నిర్మాత‌గా మారుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అందులో భాగంగా త‌న పేరుతో ఎం.ఎం.ఆర్ట్స్ అనే బ్యాన‌ర్‌ను స్టార్ట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ బ్యాన‌ర్ లోగోను దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన మ‌నోజ్ “ఎం.ఎం.ఆర్ట్స్ బ్యాన‌ర్ క్రింద కొత్త సినిమాలు చేస్తాను. కొత్త టాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌స్తాను. భ‌విష్య‌త్తులో గొప్ప సినిమాల‌ను అందించాల‌నుకుంటున్నాను“ అని మెసేజ్‌ను పోస్ట్ చేశారు.

Leave a Response