శ్రీముఖి ఫైన‌ల్స్‌కు …?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 3 ముగింపు ద‌శ‌కు చేరుకుంది. నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో వ‌చ్చే ఆదివారంతో ముగియ‌నుంది. వ‌చ్చే ఆదివారం ఫైన‌ల్ విజేత ఎవ‌రో తెలుతుంది. ఇప్ప‌టికే ఫైనల్స్‌కు రాహుల్ సిప్లిగంజ్‌, కొరియోగ్రాఫ‌ర్ బాబా భాస్క‌ర్ రీచ్ అయ్యారు. కాగా శ‌నివారం శ్రీముఖి ఫైన‌ల్స్‌కు వెళుతున్న‌ట్లు నాగార్జున తెలియ‌జేశారు. కాగా ఎలిమినేష‌న్‌కి వ‌రుణ్‌, శివ‌జ్యోతి, అలీరెజాలు ఉన్నారు. వీరిలో అలీ రెజా ఎలిమినేట్ అవుతున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఆదివారం సాయంత్రానికి ఓ క్లారిటీ రానుంది.

Leave a Response