తనకు నచ్చినప్పుడు ఆటకు వీడ్కోలు పలికే హక్కు ధోనీకి ఉంది – శాస్త్రి

భారత క్రికెట్‌లో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ రిటైర్మెంట్‌పై చర్చ సాగుతూనే ఉంది.హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి మాత్రం ధోనీకి పూర్తి మద్దతు పలుకుతూ విమర్శలకు ఘాటు సమాధానమిచ్చాడు. ధోనీ కోరుకున్నప్పుడు ఆట నుంచి తప్పుకొంటాడని, ఆ హక్కు అతడికుందని గుర్తుచేశాడు. ‘ధోనీ రిటైర్మెంట్‌ గురించి మాట్లాడడమంటే అతడిని అవమానపర్చడమే. దేశం కోసం అతడేమి సాధించాడో గమనించండి. అతను తప్పుకొంటే చూడాలని ఎందుకంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బహుశా దీనికి మించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదేమో. సమీప భవిష్యత్‌లో ధోనీ క్రికెట్‌ నుంచి తప్పుకొంటాడని అందరికీ తెలుసు. తనకు నచ్చినప్పుడు ఆటకు వీడ్కోలు పలికే హక్కును ధోనీ సంపాదించాడు. ఇకనైనా అనవసర చర్చకు అందరూ ముగింపు పలకాలి’ అని శాస్త్రి అన్నాడు.దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీ్‌సలో ఓపెనర్‌గా రోహిత్‌ శర్మ అంచనాలకు మించి రాణించాడని కోచ్‌ శాస్త్రి కొనియాడాడు. ‘సిరీస్‌ మొత్తం రోహిత్‌ ఆధిపత్యం చూపాడు. ఏ ఆటగాడైనా ఈస్థాయిలో ఆడితే ప్రత్యర్థి జట్టువణకాల్సిందే. సెహ్వాగ్‌ స్థానా న్ని భర్తీ చేయగల సామర్థ్యం రోహిత్‌కు ఉంది’ అని అన్నాడు. దీనికి తగ్గట్టుగా టీమిండియా ఆడుతున్న సిరీ్‌సలకు ధోనీ దూరంగా ఉంటూ వస్తున్నాడు.

Tags:ms dhoniravi sastry

Leave a Response