మనసుల్ని శుభ్రం చేసుకోమని చెప్పారు

‘మనం ఫ్లాట్స్‌లో, డూప్లెక్స్‌ హౌసె్‌సలో, బంగ్లాల్లో నివసించడం లేదు. మనం మన మనసుల్లో నివసిస్తున్నాం. అవును… మన శాశ్వత నివాసమదే. ప్రశాంతమైన జీవితం కోసం ముందుగా మనసులో ఎటువంటి గజిబిజి గందరగోళాలు పెట్టుకోకుండా శుభ్రం చేసుకోవాలి’’ అని కాజల్‌ అగర్వాల్‌ అంటున్నారు. దీపావళి సందర్భంగా ప్రేక్షకులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. మనసుల్ని శుభ్రం చేసుకోమని చెప్పారు. ఇంకా కాజల్‌ మాట్లాడుతూ ‘‘స్క్వేర్‌ ఫీట్స్‌లో కొలతలు వేసుకోవడానికి మనసుల్లో ఎటువంటి అడ్డంకులు, పరిమితులు లేవు. మనసు చాలా పెద్దది. మనకు కావాల్సినంత ఏరియా ఉంటుంది. మీకు ఓ విషయం తెలుసా? మన ఇంట్లో గదులు, బాల్కనీలు, గ్యారేజ్‌లు ఎంత చక్కగా ఉన్నాయి? పరిశుభ్రంగా ఉన్నాయి? అనేది అనవసరం. మన మనస్సుల్లో విషయాలను చక్కదిద్దుకున్నప్పుడే జీవితం బావుంటుంది. మనం ఏమో అన్నిటినీ తీసుకువెళ్లి మనసులో ఓ మూలకు తోసేసి చిందరవందర చేసేస్తాం. మనసు లోపల… అంచనాలను ఓ గదిలో బంధిస్తాం. సీక్రెట్స్‌ను కార్పెట్‌ కింద పెడతాం. పోలికల్ని ఒక టేబుల్‌ మీద ఊసేస్తాం. పగలు పెట్టుకుని ఒక బాక్సులో ఉంచుతాం. ప్రతిచోటా ఆందోళనలే. జాగ్రత్తగా ఉండండి. నిజమైన ఇంటికి (మనసుకు) హౌస్‌ కీపింగ్‌ని పెట్టుకోలేం. ఎవరికో ఔట్‌ సోర్సింగ్‌ ఇవ్వలేం. మనకు మనమే శుభ్రం చేసుకోవాలి. హ్యాపీ ‘దీపావళి క్లీనింగ్‌’. చీర్స్‌’’ అన్నారు.

Leave a Response