టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, దర్శకురాలు విజయనిర్మలకు వంట చేయడమంటే ఇష్టం. తల్లి శకుంతలాదేవి వద్దంటున్నా వినకుండా చిన్నప్పుడే ఆమె వంట చేయడం నేర్చుకున్నారు. హోటళ్లలో భోజనం చేసినప్పుడు వంటకాలు నచ్చితే వెంటనే వాటి తయారీ గురించి తెలుసుకుని ఇంటికెళ్లి చేసి చూసేవారు. అన్ని రకాల వంటలు చేసినప్పటికీ, ఆమె చేసే చేపల కూర మాత్రం ప్రత్యేకం. హీరో కృష్ణకు చేపలంటే ఇష్టం. అందుకని ఆమె వారానికి కనీసం మూడు రోజులు చేపల కూర చేసిపెట్టేవారు. చేపల పులుసు వాసన రాకుండా ఉండటానికి ఒక స్పూన్ ఆముదం, ఒక స్పూన్ నెయ్యి వేయడం ఆమెకు అలవాటు. ఎంత మందికైనా ఒంటిచేత్తో వంట చేసే పెట్టేవారు. ‘హరేకృష్ణ… హలో రాధ’(1980) షూటింగ్‌కి అమెరికాకు వెళ్లినప్పుడు, దాదాపు నెల రోజుల పాటు కృష్ణకు ఆమె స్వయంగా వంటచేసి పెట్టారు. అలాగే ‘కురుక్షేత్రం’, ‘సుల్తాన్’ చిత్రాల యూనిట్ సభ్యులందరూ ఆమె చేతి వంటను రుచి చూసిన వారే. ప్రస్తుతం విజయనిర్మల అంతిమ యాత్ర ప్రారంభమైంది. నానక్‌రామ్‌గూడలోని స్వగృహం నుంచి ఎందరో అభిమానుల నడుమ ఈ అంతిమ యాత్ర కొనసాగుతోంది. మరికాసేపట్లో చిలుకూరులోని విజయకృష్ణ గార్డెన్స్‌లో విజయనిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి.
previous article
Previous Post
next article
స్టార్ హీరో కాస్త అప్పడాలు అమ్ముకుంటున్నాడు.