విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ నటించనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక కీలకమైన పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని అంటున్నారు. అయితే అది ప్రత్యేకమైన పాత్రనా? లేదంటే విలన్ పాత్రనా? అనే విషయంపై స్పష్టత రావలసి వుంది. ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ సినిమాలో కార్తికేయ విలన్ గా మంచి మార్కులు కొట్టేశాడు. అందువలన ‘ఫైటర్’ సినిమాలోను ఆయన విలన్ గా కనిపించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.
previous article
అశ్వద్ధామ’గా నాగశౌర్య రొమాంటిక్ సాంగ్
next article
యాంకర్ సుమ నివాసంలో జీఎస్టీ అధికారుల దాడులు