నటి అర్చన పెళ్లి తేదీ ఖరారయింది

నటి అర్చన పెళ్లి తేదీ ఖరారయింది. నవంబర్ 13న పెళ్లి చేసుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రముఖ వ్యాపార వేత్త జగదీశ్‌ను అర్చన వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా జగదీశ్, అర్చన ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వీరి పెళ్లికి వాళ్లు అంగీకరించారు. దీంతో అక్టోబర్ 3న అర్చన, జగదీశ్ నిశ్చితార్థం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోలు సుమంత్, శివబాలాజీ, నవదీప్, నటి మధుమితతో పాటు అర్చన, జగదీశ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. నటి అర్చన తాజాగా సప్తగిరి హీరోగా నటించిన ‘వజ్రకవచధర గోవిందా’ సినిమాలో నటించారు

Leave a Response