అల్లు అర్జున్ పాటలు సంచలనం

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో’ ఆడియో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ‘సామజవరగమన’, ‘రాములో రాములా’ పాటలు విడుదలై ప్రభంజనం సృష్టిస్తున్నాయి. క్యాచీ ట్యూన్లతో ఆకట్టుకునేలా ఉన్న ఈ సాంగ్స్ ఆన్ లైన్ లో దూసుకుపోతున్నాయి. తమన్ బాణీలకు యువత ఊగిపోతోంది.ఈ రెండు పాటలు యూట్యూబ్, జియో సావన్ మ్యూజిక్ యాప్ లో 10 కోట్లకు పైగా స్ట్రీమింగ్స్ సొంతం చేసుకున్నాయి. ‘రాములో రాములా’ పాట యూట్యూబ్ లో 2.2 కోట్ల మంది చూడగా, ‘సామజవరగమన’ పాటను 6.3 కోట్ల మంది వీక్షించారు. జియో అఫిషియల్ మ్యూజిక్ యాప్ జియో సావన్ లోనూ ఈ రెండు పాటలు ట్రెండింగ్ లో ఉన్నాయి.

Leave a Response