అమ్మాకు మళ్ళీ పెళ్లి..

టెక్నాలజీ అభివృద్ధి చెందడం, సోషల్ మీడియా విస్తరించడం వంటి పరిణామాల నేపథ్యంలో నేటి యువతరం ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. అందుకు ఈ యువతి ప్రకటనే నిదర్శనం. ఒంటరిగా ఉంటున్న తన తల్లికి 50 ఏళ్ల అందమైన వరుడు కావాలంటూ ఆస్థా వర్మ అనే అమ్మాయి సోషల్ మీడియాలో స్వయంవరం ప్రకటించింది. కాబోయే వరుడు శాకాహారి అయ్యుండాలని, మద్యం అలవాటు ఉండకూడదని, జీవితంలో స్థిరపడిన వ్యక్తికి తమ ప్రాధాన్యత అని ఆస్థా వర్మ పేర్కొంది. తాను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లికి తోడు ఎవరుంటారన్న ఆలోచన రాగానే ఈ ప్రకటన ఇచ్చానని ఆమె చెబుతోంది. కాగా, ట్విట్టర్ లో ఆస్థా ఇచ్చిన మ్యాట్రిమొనీ ప్రకటనకు విశేష స్పందన వస్తోంది.

Leave a Response