మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు

ఆర్టీసీ సమ్మె ఉద్ధృతంగా కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం చలించలేదు. హైకోర్టులో తనవైపు నుంచి వాదనలను వినిపిస్తూనే ఉంది. మరోవైపు, తమ భవిష్యత్తు ఏమవుతుందో అని పలువురు కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లిలో డ్రైవర్ మహ్మద్ ఖాజా (37) బలవన్మరణానికి యత్నించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆయనను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.

Leave a Response