ముప్పై అంశాలపై చర్చ..

దాదాపు నెల రోజుల నుంచి జరుగుతున్న సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది మంది పాత సిబ్బందితో కొంత తాత్కాలిక సిబ్బందితో కొన్ని బస్సులు మాత్రమే తిరుగుతుండటంతో ప్రజల ఇక్కట్లు తొలగట్లేదు. దీంతో సమస్యకు పరిష్కారం కనుగొని ప్రజల ఇక్కట్లకు తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారు. అందుకే ఆర్టీసీ ప్రైవేటీకరణ పై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తుంది. విధుల్లో చేరేందుకు అవకాశమిచ్చిన కూడా చేరకుండా సమ్మె కొనసాగించడం పై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలోనూ పర్యటించి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీని పై కేబినెట్ లో చర్చించే అవకాశముంది. జిల్లాల పర్యటనపై క్యాబినెట్ లో నిర్ణయం తీసుకుంటారు. అద్దె బస్సుల కోసం కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు. అద్దె బస్సుల సంఖ్యను ముప్పై శాతాని కి పెంచాలని రాష్ట్రంలో ఇరవై శాతం రూట్లను పూర్తిగా ప్రైవేట్ ఆపరేటర్ లకు అప్పగించాలని నిర్ణయించింది. ఆర్టీసీ స్వరూపాన్ని పూర్తిగా మార్చాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తొంది. ఈ అంశాలన్నింటినీ కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు.ఇక పై కార్మికుల గురించి ఆలోచించకుండా ప్రజల రవాణా సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా చర్యలను వేగవంతం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు.

Tags:kcrtsrtctsrtc strike

Leave a Response