కేసీఆర్ తో పోల్చితే జగన్ వేగం…

ఒకరికిస్తే మిగతా వాళ్లు అసమ్మతి గళం విప్పుతారేమోనన్న భయాన్ని పక్కనబెట్టి తనను నమ్ముకున్నవాళ్లకు ఏదోఒక పదవితో కట్టబెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే అనేక నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు.తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే దాదాపు ఆరేళ్లుగా ఇటు నామినేటెడ్ అటు పార్టీ పదవులను భర్తీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు.తెలంగాణలో ఇంకా ఎన్నో నామినేటెడ్ పదవులు భర్తీ కాకుండానే మిగిలిపోతున్నాయి.శాట్స్ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి పదవి రెన్యువల్ అలాగే, పల్లా రాజేశ్వరరెడ్డికి రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పోస్ట్ అలాగే దక్కాయట. పల్లా కుమారుడి పెళ్లికి హాజరైన కేసీఆర్ ఆ తీపికబురును అక్కడే చెప్పి ఖుషీ చేశారట. అలాగే, శాట్స్ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఫంక్షన్ కు వచ్చి పదవి రెన్యువల్ వార్తను చెప్పారట. దాంతో, తమ ఇంట్లో కూడా త్వరగా ఏదైనా శుభకార్యం జరిగితే బాగుండ్ను తమకి కూడా ఏదో ఒక పదవి దక్కుతుందేమోనని పలువురు టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారట.

Tags:jagan mohan reddykcr

Leave a Response