ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై పూన‌మ్ కౌర్‌ ట్వీట్

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై ప‌రోక్షంగా విమ‌ర్శలు చేసి వార్త‌ల్లో నిలిచిన పూన‌మ్ కౌర్‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎందుక‌నో సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా సైలెంట్‌గానే ఉంటూ వ‌చ్చారు. అయితే రీసెంట్‌గా ఆమె పెట్టిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతుంది. ఓ చిన్న ఆలోచ‌న అంటూ `ఓ అబ‌ద్ధాల కోరు రాజ‌కీయ నాయకుడు కాగ‌ల‌డు కానీ.. లీడ‌ర్ కాలేడు` అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. ట్వీట్‌లో ఎవ‌రి పేరునూ ప్ర‌స్తావించ‌క పోయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ ఫ్యాన్స్ మాత్రం త‌మ హీరోని దృష్టిలో పెట్టుకునే పూన‌మ్ ట్వీట్ చేసిదంటూ రియాక్ట్ అవుతుండ‌టం హాట్ టాపిక్‌గా మారింది.

Leave a Response