నటి అర్చన పెళ్లి తేదీ ఖరారయింది. నవంబర్ 13న పెళ్లి చేసుకుంటున్నట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రముఖ వ్యాపార వేత్త జగదీశ్‌ను అర్చన వివాహం చేసుకోనున్నారు. కొద్దికాలంగా జగదీశ్, అర్చన ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వీరి పెళ్లికి వాళ్లు అంగీకరించారు. దీంతో అక్టోబర్ 3న అర్చన, జగదీశ్ నిశ్చితార్థం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరోలు సుమంత్, శివబాలాజీ, నవదీప్, నటి మధుమితతో పాటు అర్చన, జగదీశ్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. నటి అర్చన తాజాగా సప్తగిరి హీరోగా నటించిన ‘వజ్రకవచధర గోవిందా’ సినిమాలో నటించారు
previous article
పవన్‌కల్యాణ్‌పై పూనమ్ కౌర్ ట్వీట్
next article
నెల్లూరులో ‘ఇసుక మాఫియా’..!
Related Posts
- /No Comment
పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన చేసిన తరణ్ ఆదర్శ్
- /No Comment