ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ తొలిసారి యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌తో కలిసి వర్క్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేశారు. అయితే ఏ సినిమా కోసం వీరిద్దరూ కలిసి పనిచేస్తారనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు. అయితే సినీ వర్గాల్లో వినపడుతున్న సమాచారం ప్రకారం తమిళ, హిందీ భాషల్లో కమల్ హాసన్ `తలైవన్ ఇరుక్కురాన్` అనే సినిమాను తెరకెక్కించబోతున్నారట. ఇదే సినిమాను హిందీలో `అమర్ హై` పేరుతో విడుదల చేస్తారు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్, లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా రూపొందనుంది. కమల్‌హాసన్, రెహమాన్ కాంబినేషన్లో రూపొందబోయే తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.
previous article
హీరో అవతారం ఎత్తబోతున…
next article
షారుక్ ఖాన్‌కు డాక్టరేట్…..