ఎం.ఎం కీరవాణి కొడుకు హీరోగా అభిమానుల ముందుకు…

కీరవాణి గా పేరు గాంచిన కోడూరి మరకతమణి కీరవాణి ప్రముఖ తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు మరియు గాయకుడు. తెలుగులో సినీ రంగంలో ఎం. ఎం. కీరవాణిగా, తమిళంలో మరకతమణిగా, హిందీలో ఎం. ఎం. క్రీమ్ గా ప్రసిద్ధుడు. తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి ప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు – మమత తెలుగు చిత్రం ద్వారా ఎం. ఎం. కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. అప్పటినుండి తెలుగు, తమిళ, హిందీ భాషలలో నూరు వరకూ చిత్రాలకు సంగీతాన్ని అందించాడు. 1997లో వచ్చిన అన్నమయ్య చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సంగీతదర్శకునిగా పురస్కారాన్ని అందుకున్నాడు. కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి. ఈయన మొదటి సినిమా రామోజీ రావు నిర్మించిన మనసు మమత అనే చిత్రం. తర్వాత అదే సంస్థలో పీపుల్స్ ఎన్ కౌంటర్, అమ్మ, అశ్విని తదిరత చిత్రాలకు పనిచేశాడు. రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన క్షణక్షణం ఆయనకు మంచి బ్రేక్ నిచ్చింది. తర్వాత కె. రాఘవేంద్రరావు తో 27కి పైగా సినిమాలు చేశాడు. తర్వాత రాజమౌళి దర్శకుడిగా వచ్చిన అన్ని సినిమాలకు ఆయనే సంగీత దర్శకత్వం వహించాడు. ఇక అసలు విషయానికి వస్తే… కీర‌వాణి కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటున్నారు. కీర‌వాణి పెద్ద కుమారుడు కాల‌భైర‌వ ఆల్రెడీ తెలుగులో సింగ‌ర్‌గా త‌న‌దైన ముద్ర వేశారు. పెక్యూలియ‌ర్ వాయిస్‌తో ఆయ‌న పాడిన పాట‌లు శ్రోత‌ల‌కు న‌చ్చాయి. మ‌రోవైపు ఆయ‌న సంగీత ద‌ర్శ‌కుడిగానూ త‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కీర‌వాణి రెండో కుమారుడు శ్రీ సింహా కూడా సినిమా రంగంలోనూ త‌న ల‌క్కును ప‌రీక్షించుకోవాల‌ని భావిస్తున్నాడు. శ్రీసింహాకు మొద‌టి నుంచీ ద‌ర్శ‌క‌త్వం అంటే చాలా ఇష్టం. రంగ‌స్థ‌లం చిత్రానికి కూడా అత‌ను ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేశారు. ద‌ర్శ‌కుడిగా స్థిర‌ప‌డుతాడ‌ని అనుకుంటే, అత‌ను ఇప్పుడు రూట్ మార్చి హీరోగా ట్రై చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ద‌ర్శ‌కుడి గురించి హీరో బాగా అర్థం చేసుకోవ‌డానికి వీలుగా ఉంటుంద‌నే ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేశాడ‌ట‌. హీరోగా ట్రై చేయ‌డం కోసం ఇప్ప‌టికే ప‌లు ర‌కాల శిక్ష‌ణ‌లు కూడా తీసుకున్నార‌ట‌. ఇక తర్వరలోనే అభిమానుల ముందుకు వస్తున్నాడు.

Image result for mm keeravani sun sri simha

Leave a Response