టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ లు ఇద్దరూ కలిసి కనిపించడం చాలా అరుదనే చెప్పాలి. తాజాగా వీరిద్దరూ కలిసి తమ అభిమానితో కలిసి సందడి చేశారు. ఓ అభిమానితో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రి స్నేహితులైన తారక్, రాంచరణ్ లు ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం విశాఖ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సిమిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం రూ. 350 నుంచి 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు టాలీవుడ్ టాక్.
previous article
యాంకర్ సుమ నివాసంలో జీఎస్టీ అధికారుల దాడులు
next article
రెండేళ్లుగా ‘దేవరాశాంటా’ నిర్వహిస్తున్న విజయ్