తనపై కామెంట్ చేసిన ఓ నెటిజన్‌కు ఛాలెంజ్ విసిరారు సినీ నటి తాప్సి. త్వరలో ఆమె దర్శకుడు అనుభవ్ సిన్హాతో కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. ఇలాంటి సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని, ఇప్పుడు ఆ కల నెరవేరబోతోందని పేర్కొంటూ దర్శకుడితో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీనిపై విశాల్ అనే నెటిజన్ కామెంట్ చేస్తూ..‘అనుభవ్ సర్.. మీరు సినిమాలో తాప్సికి బదులు మరో నటిని ఎంచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. తాప్సికి నటనే రాదు’ అని కామెంట్ చేశాడు. ఇందుకు తాప్సి సమాధానమిస్తూ.. ‘సారీ.. ఇప్పుడేం చేయలేవ్. ఎందుకంటే సినిమాకు సంతకం చేసేశాను. ఇప్పుడు అనుభవ్ సర్ నన్ను తీసేయాలని నిర్ణయించుకున్నా నేను అది జరగనివ్వను. ఒక పనిచెయ్. నేను మరో సినిమాకు సంతకం చేసేలోపు ఆ చిత్రంలో నన్ను ఎవ్వరూ తీసుకోకుండా ఆపి చూడు’ అని ఛాలెంజ్ విసిరారు. తాప్సి దీటుగా బదులిచ్చారంటూ అభిమానులు ఆమెను ప్రశంసిస్తున్నారు.
previous article
ప్రభాస్ న్యూ సాంగ్..?
next article
16 కోట్లకు ఇల్లు కొన్నావా…..