నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం ఈదూరుకు చెందిన గుండాల వంశీ కృష్ణా రెడ్డి ప్రస్తుతం నెల్లూరు నగరంలోని వేదాయపాళెం వంగతోటల ప్రాంతంలో నివసిస్తున్నాడు. మైనింగ్ లీజులు కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ పలువురిని వంశీకృష్ణ రెడ్డి మోసం చేశాడు. ఐటీ మంత్రి గౌతమ్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మనోహర్ రెడ్డి ఫిర్యాదు మేరకు వంశీ కృష్ణా రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. అతడు చేసిన మోసాల గురించి విన్నాక పోలీసులు కూడా విస్తుపోయారు.అబద్ధపు హామీలతో పలువురి నుంచి డబ్బు వసూలు చేయడమే కాదు దొంగతనాలు ఆఖరికి హత్యలూ ,అత్యాచార కేసులతో కూడా వంశీకృష్ణ రెడ్డికి సంబంధం ఉంది. పెద్ద నోట్ల రద్దు సమయంలో నోట్ల మార్పిడి చేస్తానంటూ ఇరవై మూడు లక్షల రూపాయలను మోసం చేసి గూడూరులో అరెస్టు కాగా బాలాజీ నగర్ లో గతంలో ఒకరి మీద దాడి చేసిన కేసులో అరెస్టయ్యాడు. 2017 లో ఢిల్లీ కి చెందిన యువతిపై అత్యాచారం చేసిన కేసులో తెలంగాణలో అరెస్టయ్యాడు. ఈ సమయంలో గూడూరుకు చెందిన హర్షవర్థన్ అనే మరో మోసగాడుతో పరిచయం ఏర్పడి అతని ద్వారా బెయిల్ కోసం ప్రయత్నిం చేశాడు. ఈ పంచాయతీకి సంబంధించి నెల్లూరు లోని డిఆర్ హోటల్ లో జరిగే జగదీష్ డబ్బులు డిమాండ్ చేసే క్రమంలో జగదీష్ ని చిత్రహింసలకు గురి చేయగా అతని భార్య వంశీక్రిష్ణ రెడ్డి పై కేసు పెట్టింది. ఆక్రమంలలో జైలు నుంచి వచ్చిన వంశీక్రిష్ణ రెడ్డి తన గురించి పోలీసులకు సమాచారమిచ్చిన హర్షవర్దన్ ను క్రికెట్ బ్యాట్ తో కొట్టి చంపినట్లుగా పోలీసులకు విచారణలో వెల్లడించాడు. దీనిమీద విజయవాడ పరిధిలో కేసు నమోదైంది. మరోవైపు వంశీకృష్ణ రెడ్డి తప్పుడు చిరునామాలతో ఆధార్ కార్డు సృష్టించి ప్రజలను మోసం చేశాడు, తాజాగా రాజు అనే వ్యక్తికి గనులను ఇప్పిస్తానని 40 లక్షలు మోసం చేశాడు.