ప్రధాని మోదీ విమానానికి అనుమతి చ్చేది లేదని ప్రకటించింది పాక్ ప్రభుత్వం. దింతో మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. జమ్మూకాశ్మీర్ లోని మానవహక్కుల ఉల్లంఘనను కారణంగా చూపింది. ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి తెలిపారు. అనుమతి నిరాకరణ విషయాన్ని భారత్ హైకమిషనర్ కు లిఖిత పూర్వకంగా తెలియజేయనున్నట్లు ఖురేషి అన్నారు. కాశ్మీరులకు మద్దతుగా నేడు బ్లాక్ డే నిర్వహిస్తోంది. సోమవారం మోదీ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్నారు. అంతర్జాతీయ బిజినెస్ ఫోరమ్ లో పాల్గొనడంతో పాటు అక్కడి నేతలతో భేటీ కానున్నారు. గత నెల అమెరికా పర్యటన సందర్భంలోనూ పాక్ గగనతలం నుంచి ప్రధాని విమాన ప్రయాణాని అనుమతి నిరాకరించింది. రాష్ట్రపతి రామ్ నాధ్ గోవింద్ ఐస్ ల్యాండ్ పర్యటన సమయంలోను ఇదే విధంగా వ్యవహరించింది. బాలాకోట్ దాడుల తర్వాత గగనతలని మూసివేసింది పాక్. ఇటీవల ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో భారత విమానాలను మూసివేసిన సంగతి తెలిసిందే.
Tags:Indiamodi
previous article
హన్సికకు రూ.10కోట్ల కారును బహుమతి ఇచ్చిందెవరో తెలుసా?
next article
‘హాలీవుడ్ సినిమాతో పాటు తెలుగు సినిమా రావాలి …