ఒక్కసారి వాడిన తర్వాత వాటిని…

టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసారు. పూరీ జగన్నాథ్ అందరిలా కాకుండా సమాజాన్ని చూసే కోణం కొత్తగా ఉంటుంది. పూరీ మాత్రం దీన్ని వేరే కోణంలో ఆలోచించారు. ఏకంగా మోదీకి లేఖ రాసి మన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించినంతమాత్రాన పర్యావరణం బాగుపడదని, అందుకోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఒక లేఖ రాసి ట్విటర్ లో షేర్ చేశారు.ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్ర సమస్య వాతావరణ మార్పు. దానికి ప్లాస్టిక్ వాడకం కూడా ఒక కారణం. కానీ అదొక్కటే కారణం కాదు. వాతావరణ మార్పునకు చాలా కారణాలు ఉన్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేదించినంత మాత్రాన ఈ సమస్య పరిష్కారం కాదు. 1960 దశకంలో ప్లాస్టిక్ వాడకం బాగా పెరగడం వల్ల పేపర్ బ్యాగ్‌ల వాడకం తగ్గి చెట్లు, అడవులను కొట్టేయడం తగ్గింది. మళ్లీ ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్‌లను నిషేధించి పేపర్ బ్యాగ్‌లు వాడడం మొదలుపెడితే చెట్లను, అడవులను నరకాల్సిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. ప్లాస్టిక్‌ను ఒక్కసారి వాడిన తర్వాత వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్లే అవి పర్యావరణానికి హానికరంగా మారుతున్నాయి. అందుకే ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌నే మళ్లీ మళ్లీ వాడేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వం ప్లాస్టిక్ రీ-సైక్లింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేయాలి. ఒక్కసారి వాడిన ప్లాస్టిక్‌ను తీసుకొస్తే డబ్బులిస్తామని ప్రకటిస్తే ప్రజలే ఆ యూనిట్లకు తాము వాడేసిన ప్లాస్టిక్ కవర్లను తీసుకొస్తారు. ఇలాంటి చర్యలు చేపడితే ప్లాస్టిక్ నుంచి పర్యావరణాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చ అని పూరీ ఆ లేఖలో పేర్కొన్నారు. పూరీ రాసిన ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే గాక యువతని ఆలోచనలో పడేసింది.ప్లాస్టిక్ పర్యావరణానికి హాని, ప్లాస్టిక్ నిషేధించి పేపర్ బ్యాగ్ లు వాడాలని ఎప్పటినుంచో అందరూ చెప్తున్నారు. ఇటీవల మోదీ కూడా.. పర్యావరణానికి హాని కలిగిస్తున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని, భారత్‌ను ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ప్రజలు కూడా అవును నిజమే కదా ప్లాస్టిక్ ని నిషేధించి, పేపర్ బ్యాగ్ లు వాడితే పర్యావరణానికి మంచిదని భావించారు.

Tags:modipuri jagannadh

Leave a Response