AP అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై జోరు పెంచారు.ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం అర్ధరాత్రి విడుదల చేశారు.4 లోక్ సభ స్థానాలకు 32 శాసన సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించారు జనసేనాని.రాజమెండ్రిలోని అర్బన్ కాలేజీ లో జనసేన ఆవిర్భావ సభ ఈ రోజు జరగనుంది.ఈ రోజుతో జనసేన 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.అలాగే కావాల్సిన ఏర్పాటులన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు.ఎన్నికల సమారా శంఖారావాన్ని పవన్ ఇక్కడినుంచే పూరించనున్నారు.ఐతే దీనికి సంబంధించిన వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.అలాగే రాజమహేంద్ర నగరం అంతటా led స్క్రీన్స్ తో నిండిపోయింది.అలాగే లక్షలాదిగా పాల్గొననున్న జనసైనికులు వీరమహిళలు,యువత,రైతులు.మహిళలు,లక్షల్లో ఉండబోతున్నారన్న అంచనా.ఈ రోజు మేనిఫెస్టో విడుదల.నిన్న రాత్రి 32 అసెంబ్లీలు,4 లోక్ సభ అభ్యర్థులను ప్రకటించారు,ఈ రోజు మిగతా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.సాయంత్రం 3 నుంచి 3.30 మధ్యలో పవన్ సభ ప్రాంగణానికి చేరుకునే అవకాశం.
previous article
ప్రతి ఓటును తనిఖీ చేయండి: వైఎస్ జగన్
next article
ఒకే దశలో ఎన్నికలపై సుప్రీంను ఆశ్రయిస్తాం
Related Posts
- /No Comment