జనసేన పార్టీ నేతలు షాక్ మీద షాక్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఆ పార్టీ నేతలు షాక్ మీద షాక్ ఇచ్చారు. ఇప్పటికే రావెల కిశోర్ బాబు, అద్దేపల్లి శ్రీధర్, డేవిడ్ రాజు, మారంశెట్టి రాఘవయ్య, చింతల పార్థసారథిలు పార్టీకి గుబ్ బై చెప్పారు. జనసేనకు ఆ పార్టీ నేత ఆకుల సత్యనారాయణ షాక్ ఇచ్చారు.పార్టీకి రాజీనామా చేసిన ఆయన… రాజీనామా లేఖను జనసేనాని పవన్ కల్యాణ్ కు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖలో ఆయన పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా పార్టీతో ఆయన అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.దింతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.గత ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేసిన ఆకుల సత్యనారాయణ ఓటమి పాలయ్యారు.మరికొందరు నేతలు కూడా పార్టీని వీడే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Leave a Response