అక్కినేని నాగచైతన్య .. సమంత జంటగా నిర్మితమైన ‘మజిలీ’ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను చైతూ .. సమంత మొదలెట్టేశారు. తాజా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను గురించి కూడా ప్రస్తావించింది. “చైతూ గురించి నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు .. అలాగే నా గురించి చైతూ కంటే ఎక్కువగా ఎవరికీ తెలియదు. అలా మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది” అని సమంత అంది. ఇక తనకెదురైన ప్రశ్నకి చైతూ సమాధానమిస్తూ .. ‘ఎవరికైనా పెళ్లి అయిన ఏడాది వరకే హ్యాపీగా వుంటుంది .. ఆ తరువాత అంతా బోరింగే’ అంటూ సమంతను ఉడికించాడు. మరో ప్రశ్నకి సరదా సమాధానంగా ఆయన ‘నాకు కార్లన్నా .. అమ్మాయిలన్నా చాలా ఇష్టం’ అనడంతో, ‘అలా అంటే ముఖంపై పంచ్ ఇస్తాను’ అంటూ కొంటె కోపాన్ని ప్రదర్శించింది ఆ ముద్దుగుమ్మా.
previous article
‘ మన్మథుడు 2’కి ముహూర్తం ఖరార్.
next article
బాలికను దత్తత తీసుకున్న మంచు మనోజ్…
Related Posts
- /No Comment