బాలికను దత్తత తీసుకున్న మంచు మనోజ్…

సామాజికసేవా కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసే సినీ నటుడు మంచు మనోజ్… తాజాగా ఓ బాలికను దత్తత తీసుకుని తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు ఆ యంగ్ హీరో. తన తండ్రి మోహన్ బాబు 69వ పుట్టినరోజును పురస్కరించుకుని సిరిసిల్ల ప్రాంతానికి చెందిన ‘అశ్విత’ అనే బాలికను దత్తత తీసుకున్నాడు. తిరుపతిలోని తమ సొంత విద్యా సంస్థ శ్రీ విద్యానికేతన్ లో ఆమెను చేర్పించారు. పాప బాధ్యతలన్నీ తానే తీసుకుంటానని ఈ సందర్భంగా మనోజ్ ట్వీట్ చేశాడు. పాపను జాగ్రత్తగా చూసుకుంటానని… ఐఏఎస్ అధికారి కావాలనేది పాప ఆశయమని… ఆమె అనుకున్నది సాధించేందుకు కావాల్సినదంతా చేస్తానని తెలిపాడు. ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని ట్వీట్ తెలిపాడు.

Leave a Response