రవితేజ తో వెంకీ..?

మల్టీస్టారర్ మూవీలతో వెంకటేష్ దూసుకుపోతున్నారు. మహేష్ బాబుతో కలసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కల్యాణ్ తో కలసి ‘గోపాల గోపాల’, తాజాగా వరుణ్ తేజ్ తో కలసి చేసిన ‘F2’ సినిమాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో, మరిన్ని మల్లీస్టారర్ మూవీలు చేసేందుకు వెంకటేష్ మొగ్గు చూపుతున్నారు. తాజాగా, దర్శకుడు వీరు పోట్ల వెంకీ కోసం ఓ మల్టీ స్టారర్ కథను సిద్ధం చేశాడట. ఈ చిత్రంలో వెంకీ తో కలసి రవితేజ నటించనున్నారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం చర్చల దశలోనే ఉంది. త్వరలోనే దీనిపై ఫుల్ క్లారిటీ రానుంది. మరోవైపు, నాగచైతన్యతో కలసి వెంకీ ప్రస్తుతం ‘వెంకీ మామ’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Image result for ravi teja venkatesh

Leave a Response