ఎలిజబుల్ బ్యాచిలర్, కోలీవుడ్ యాంగ్ హీరో శింబు. పలువురు హీరోయిన్స్‌తో ఈయనకి ఎఫైర్స్ ఉన్నట్టు గతంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే త్వరలో ఈ మన్మథుడు పెళ్లి పీటలెక్కనున్నట్టు కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. శింబు ఫ్యామిలోనే ఒక అమ్మాయిని చూడగా, ఆమెతో ఆగస్ట్‌లో పెళ్లిపీటలెక్కనున్నాడట శింబు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు. గతంలో శింబు.. నయనతార, హన్సికలతో ప్రేమాయణం నడిపిన విషయం తెలిసిందే. ఇటీవల శింబు సోదరుడు కురళరసన్ ఓ ఇంటివాడయ్యాడు. కురళరసన్, నబీలా అహ్మద్ అన్నాశలైలోని మసీదులో ఇస్లాం సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. ఏప్రిల్ 26న వీరి వివాహం జరిగింది.