మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్బాగ్ మూడో సీజన్లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలా ప్రాతినిద్యం లేనట్టే అని భావిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్‌బాస్-3పై ఇప్పటికే ఎన్నో ఊహాగానాలు షికారు చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. మూడో ఎపిసోడ్‌కు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం ప్రచారంలో ఉండగా గుత్తా జ్వాలా కూడా పార్టిసిపేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఆమె ఎక్కువ పారితోషికం అడిగిందని, అందుకే నిర్వాహకులు వద్దనుకున్నారని సమాచారం. ఇది తన ఇమేజ్‌కి దెబ్బగా భావించిన జ్వాలా ట్విట్టర్ వేదికగా తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం లేదని ప్రకటించారు. మొదటి సీజన్ బిగ్‌బాస్‌కు జూనియర్ ఎన్టీఆర్, రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నానీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, మూడో సీజన్‌కు నాగార్జున ఈ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. మూడో సీజన్లో శ్రీముఖి, వరుణ్‌సందేశ్, ఆర్.జే,హేమంత్ ఇప్పటి వరకు ఖరారైన పేర్లుగా ప్రచారం జరుగుతోంది.