ఆయనతో మరోసారి జోడీ కట్టాలని వుంది..!

తెలుగులో విడుదలైన ‘సైరా’ చిత్రంలో తమన్నా ఒక ముఖ్యమైన పాత్రను పోషించింది.తన పాత్రకి మంచి పేరు రావడంతో ఆమె ఫుల్ ఖుషీ అవుతోంది. తమన్నా తమిళంలో చేసిన ‘పెట్రోమ్యాక్స్’ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ “చాలా కాలం క్రితం విజయ్ తో కలిసి ‘సుర’ సినిమాలో నటించాను. ఆ సినిమాలో నా పాత్ర చాలా చిన్నది. పాటల షూటింగు సమయంలోను సెట్ కి వచ్చేసి డాన్సులు చేసేసి వెళ్లిపోయేదానిని. అప్పటికే విజయ్ పెద్ద స్టార్ కావడం వలన ఎక్కువగా మాట్లాడేదానిని కాదు. ఆయనతో మరోసారి జోడీ కట్టాలని వుంది. అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను” అని వ్యాఖ్యానించింది.

Tags:petromax moviesairatamanavijay

Leave a Response